ఏపీ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు మతి స్థిమితం ఏ మాత్రం పనిచేయడం లేదని స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే మొత్తం 40 సంవత్సరాల రాజకీయ సుదీర్ఘ అనుభవం అని చెప్పుకునే చంద్రబాబు ఒక యువ నాయకుడు రాజకీయాలు ముందు తట్టుకోలేకపోతున్నారు అంటే ఆయనకు మానసిక స్థైర్యం ఏమాత్రం లేదని ఇన్నేళ్ళ రాజకీయ చరిత్రలో ఎక్కడా క్రెడిబులిటి అనే పదమే తెలియదని అర్థం అయిపోతుంది. ప్రతి ఎన్నికల ముందు ఇష్టానుసారంగా హామీలు ఇవ్వడం గెలిచిన తర్వాత ప్రజలను పట్టించుకోకపోవడం పోరాటం చేసిన ప్రజలపై కేసులు పెట్టడం మరోసారి అధికారంలోకి రావడానికి తప్పుడు హామీలు ఇవ్వడం ఇదే చంద్రబాబు నాయుడు ఇప్పటివరకు చేసిన రాజకీయం.
అయితే రోజులు మారాయి జనరేషన్ మారింది ప్రజలు ఆలోచించడం మొదలుపెట్టారు. నిజా నిజాలు తెలుసుకోవడం ప్రారంభించారు కేవలం కొన్ని పత్రికల్లో టీవీల్లో చూసి నమ్మే పరిస్థితిలో ప్రజలు లేరు ఎవరికి వారు స్వచ్ఛందంగా సోషల్ మీడియాను కూడా పెద్ద ఎత్తున ఉపయోగిస్తున్నారు. ఈ క్రమంలో 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు చేసిన అక్రమాలన్నీ సాక్ష్యాధారాలతో సహా బయట పడ్డాయి. వీటి నుంచి తప్పించుకునేందుకు కేవలం అధికారంలో కేంద్రంలో ఏ పార్టీ ఉంటే ఆ పార్టీ దగ్గరకు వెళ్లేందుకు చంద్రబాబు నిస్సిగ్గుగా ముందుకు వెళ్తున్నారు. ఇదే సమయంలో ప్రజలు తనను ఏమనుకుంటారు ప్రజలు ఎటువైపు ఆలోచిస్తున్నారు ప్రజాభిప్రాయం ఎలా ఉందనే కనీసం ఆలోచించలేని పరిస్థితికి చంద్రబాబు వచ్చేసారు. ఇలాంటి పరిస్థితుల్లో అసలు చంద్రబాబు నాయుడు మైండ్ పని చేస్తుందా లేదా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి.