ఎట్టకేలకు నూతన బీసీసీఐ ప్రెసిడెంట్ భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ మహేంద్రసింగ్ సింగ్ ధోని పై స్పందించాడు. ప్రపంచకప్ తరువాత ధోని క్రికెట్ కు దూరంగా ఉన్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ధోని పై చాలా మంది తమకు నచ్చినట్టుగా మాట్లాడుకుంటున్నారు. ధోని క్రికెట్ లో అడుగుపెడతారా లేదా అని ప్రశ్నలు వినిపిస్తున్నాయి. కొందరు మాజీలు సైతం దీనిపై స్పందించారు. ఇక బీసీసీఐ ప్రెసిడెంట్ గంగూలీ మాత్రం ఒక క్లారిటీ ఇచ్చారు. ధోని ఏం చెయ్యాలి అనుకుంటున్నాడో మనకి తెలియాలి. తనకి ఏం కావాలో మరియు ఏం వద్దనుకుంటున్నాడో నేను తెలుసుకుంటా అంటూ చెప్పుకొచ్చాడు.
