Home / SLIDER / రైతులు అదనపు ఆదాయం పొందాలన్నదే సీఎం కేసీఆర్ ఆలోచన

రైతులు అదనపు ఆదాయం పొందాలన్నదే సీఎం కేసీఆర్ ఆలోచన

పాడి సంపద పెరగాలి.! రైతులు అదనపు ఆదాయం పొందాలన్నదే ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచన.! దేశంలోనే ఎక్కడ లేని ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని పాడి పరిశ్రమ రైతులను రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు కోరారు. జిల్లా కేంద్రమైన సిద్ధిపేట కొండా భూదేవి గార్డెన్స్ లో గురువారం మధ్యాహ్నం పశు సంవర్థక శాఖ, పాడి పరిశ్రమ అభివృద్ధి సహకార సమాఖ్య ఆధ్వర్యంలో పాడి పశువుల పంపిణీ, గొర్రెల అభివృద్ధి పథకం లబ్ధిదారులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ.. దేశ వ్యాప్తంగా వివిధ రాష్ట్రాల వారీగా కేంద్ర ప్రభుత్వం సంచిక విడుదల చేసిందని., ఆ సంచికలో రాష్ట్రాల వారీగాపాడి సంపద ఏలా పెరిగిందని., ఏ ఏ గొర్రెల సంపద ఏలా సృష్టించారని తేలిస్తే ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన కృషికి కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన సంచిక నిదర్శనమని చెప్పారు.
 
తెలంగాణ రాష్ట్రంలో గత సంవత్సరం నుంచి 45 శాతం గొర్రెల సంపద పెరిగిందని, 5 శాతం పాడి పెరిగిందని, 3 శాతం ఆవుల సంపద పెరిగిందని.., ఓ వైపు పట్టణీకరణ పెరుగుతున్న నేపథ్యంలో.. ముఖ్యమంత్రి కేసీఆర్ ముందుచూపుతో చేసిన కృషితో.మ్ రైతులకు మేలు జరుగుతున్నదని మంత్రి హరీశ్ రావు చెప్పారు. మరో వైపు బీహార్ రాష్ట్ర బీజేపీ మంత్రి, కర్ణాటక రాష్ట్రకాంగ్రెస్ మంత్రి వచ్చి తెలంగాణ రాష్ట్రంలో చేపట్టే సంక్షేమ పథకాలు గ్రేట్ అని చెబుతున్నాయని వివరించారు.జిల్లాలో 563 మంది డీడీలు కట్టారని, ప్రతి రైతు వెళ్లాల్సి ఉంటుందని మీ వెంట డైరీ డెవలప్మెంట్ అధికారులు 3 ముగ్గురు మీ వెంట వస్తారని మంచి పశువులను చూసి కొనుగోలు చేసుకుని రావాలని ఇందుకు సంబంధించి పలు మార్కెటింగ్ ట్రిక్స్ చెప్పారు. బర్రెలు తేవాలని., విజయ డైరీకి పాలు పోయాలని.. మీకు నచ్చిన బర్రెను కొనుగోలు చేసేప్పుడు డైరీ కార్పొరేషన్ తరపున3 అధికారులు మీ వెంట ఉంటారని., ప్రభుత్వం ఇచ్చే డబ్బు మీకే చెందాలన్నదే సీఎం కేసీఆర్ ఆశయమని మంత్రి వివరించారు.
 
ప్రభుత్వం వచ్చాక 476 మంది పారా వర్కర్స్, 240 మంది వెటర్నరీ వైద్యులను నియమించినట్లు వెల్లడిస్తూ.., గోపాలమిత్రలకు రూ.8500జీత భత్యం పెంపు చేసినట్లు, గొర్రెలకు నట్టల మందును యేటా 3 సార్లు వేస్తూ.. సీఏం కేసీఆర్ చేసిన అదనపు అవకాశం ఇచ్చారని తెలిపారు. జిల్లాలో 563 మంది లబ్ధిదారులకు గొర్రెలను కొనుగోళ్లు చేసేలా మీ జాతికి మేలు జరిగే విధంగా కమ్యూనిటీ వర్గాలు భాగస్వామ్యం కావాలని కోరారు. అలాగే పాడి రైతులకు అనలైజర్స్ 40 కావాలని తొందరగా పంపాలని పాడి పరిశ్రమ ఏండీని కోరారు. అంతకు ముందు ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, జెడ్పి చైర్మన్ వేలేటి రోజా రాధాకృష్ణ శర్మలు మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం వినూత్న సంక్షేమ పథకాలను ప్రవేశ పెట్టి అమలు చేస్తూ.. దేశం గర్వించేలా చేస్తున్నదని వివరించారు. ఈ కార్యక్రమంలో పశు సంవర్థక శాఖ డైరెక్టర్ లక్ష్మారెడ్డి, పాడి పరిశ్రమ అధికారులు, విజయ డైరీ డైరెక్టర్, ఇతర ప్రజాప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat