ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చరిత్రాత్మక నిర్ణయం తీసుకున్నాడు. 2020 జనవరి నుండి ఏపీపీఎస్సీ ద్వారా భర్తీ అయ్యే ఉద్యోగాలకు ఇంటర్వ్యూల విధానాన్ని రద్దు చెయ్యాలని ముఖ్యమంత్రి జగన్ నిర్ణయం తీసుకున్నారు. ఏపీపీఎస్సీ నిర్వహించే ప్రతి పరీక్షలో ప్రఖ్యాత ఐఐటీ, ఐఐఎం భాగస్వామ్యం తీసుకునేలా ఆలోచన చేయాలని సీఎం ఆదేశించారు. ఏపీపీఎస్సీ నిర్వహించే ప్రతి నోటిఫికేషన్ కోర్టు కేసులకు దారితీస్తుందన్న అధికారులు ఇకపై ఎలాంటి తప్పులు జరగకూడదన్నారు. అత్యవసర సర్వీసులు అందిస్తున్న విభాగాల్లో పోస్టుల భర్తీకి ప్రాధాన్యత ఇవ్వనున్నారు.
