వైసీపీ సీనియర్ నేత విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేదికగా చంద్రబాబుపై మరోసారి విరుచుకుపడ్డాడు. ప్రతి రోజు కనీసం మూడు గంటలైనా మైకులో మాట్లాడక పోతే చంద్రబాబు గారికి భోజనం సహించదు, నిద్ర పట్టదు. ఏ మీటింగు లేక పోతే వీడియో కాన్ఫరెన్స్ పేరుతో తమను హింసిస్తాడని ఆ పార్టీ నాయకులు చెప్పి బాధ పడుతున్నారు. బానిస మీడియాలో తన వీడియోలు, వార్తలు చూసుకుంటే తప్ప ఆయనకు తృప్తిగా ఉండదని మండిపడ్డారు. ఇక మరో ట్వీట్ లో ‘ఎవరిచ్చారు మీకీ అధికారం’ అంటూ చంద్రబాబు పదే పదే శోకాలు పెడుతుంటే ప్రజలు నవ్వుతున్నారని ఎక్కడ మాట్లాడినా ఒక కమేడియన్ తరహాలో కార్యకర్తలను అహ్లాదపరచడం పైనే ఆయన దృష్టి పెట్టినట్టున్నారని అన్నారు. ప్రజలెన్నుకున్న ప్రభుత్వాన్ని ఇలా ప్రశ్నించరాదనే కనీస సృహ కూడా లేదని చంద్రబాబుపై మండిపడ్డారు.
ప్రతి రోజు కనీసం మూడు గంటలైనా మైకులో మాట్లాడక పోతే @ncbn గారికి భోజనం సహించదు, నిద్ర పట్టదు. ఏ మీటింగు లేక పోతే వీడియో కాన్ఫరెన్స్ పేరుతో తమను హింసిస్తాడని ఆ పార్టీ నాయకులు చెప్పి బాధ పడుతున్నారు. బానిస మీడియాలో తన వీడియోలు, వార్తలు చూసుకుంటే తప్ప ఆయనకు తృప్తిగా ఉండదు.
— Vijayasai Reddy V (@VSReddy_MP) October 17, 2019