మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు రోజురోజుకి దిగాజారిపోతున్నాడు. మొన్నటివరకు కొడుకు లోకేష్ ఒక్కడే ఇలా ఉన్నాడు అనుకుంటే ఇప్పుడు తండ్రి కూడా అలానే తయారయ్యాడని అంటున్నారు. అధికారంలోకి వచ్చి నాలుగు నెలలే అయినా చంద్రబాబు ఐదేళ్లలో చెయ్యలేని పనులను జగన్ అతి తక్కువ సమయంలోనే చేసి చూపించాడు. అది చూసి ఓర్వలేని చంద్రబాబు పూర్తిగా దిగజారిపోయి ఏవేవో కట్టుకధలు అల్లుతున్నాడు. దీనిపై స్పందించిన విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేదికగా బాబుకి, లోకేష్ కి చుక్కలు చూపించాడు. గ్రామ కార్యకర్తలుగా ఎంపికైన వారిలో ఎవరికీ ఓనమాలు రావట్లేదని చంద్రబాబు గారు కడుపు మంట మాటలు మాట్లాడుతున్నారు. అందరూ తన కొడుకు లోకేష్ లాగా మొద్దబ్బాయిలనుకుంటున్నాడు. లోకేశ్ తో పరీక్ష రాయించండి కనీసం పది మార్కులు కూడా తెచ్చుకోలేరని ఉద్యోగాలు సాధించిన యువత ఇప్పటికే సవాలు చేశారు అని అన్నారు.
గ్రామ కార్యకర్తలుగా ఎంపికైన వారిలో ఎవరికీ ఓనమాలు రావట. @ncbn గారి కడుపు మంట మాటలు. అందరూ తన కొడుకు @naralokesh లాగా మొద్దబ్బాయిలనుకుంటున్నాడు. లోకేశ్ తో పరీక్ష రాయించండి కనీసం పది మార్కులు కూడా తెచ్చుకోలేరని ఉద్యోగాలు సాధించిన యువత ఇప్పటికే సవాలు చేశారు. @AndhraPradeshCM
— Vijayasai Reddy V (@VSReddy_MP) October 17, 2019