ఖిలా వరంగల్‌ను పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామని రాష్ట్ర మున్సిపల్‌శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అరవింద్‌కుమార్ అన్నారు. గురువారం వరంగల్‌నగర మాజీ డిప్యూటీ మేయర్ కట్టెసారయ్యతో కలిసి ఖిలా వరంగల్‌ను సందర్శించారు. శంభునిగుడి, గండం చెరువుపార్క్, కాకతీయుల నాటి ఇతర చారిత్రక కట్టడాలను ఆయన పరిశీలించారు. కుష్మహల్, కాకతీయ తోరణాల నిర్మాణశైలిని చూసి అబ్బురపడ్డారు. ఇటీవల చేపట్టిన అభివృద్ధి పై వాకబు చేశారు. ఖిలా వరంగల్‌లో నిర్మిస్తున్న పురావస్తు మ్యూజియం గురించి తెలుసుకున్నారు. గుండం చకకెరువు భద్రకాళి బండ్లాగా అభివృద్ధి చేస్తామని తెలిపారు. తెలంగాణ వైభవానికి చరిత్రకు నిదర్శనంగా నిలిచిన కాకతీయ రాజులైన గణపతి దేవుడు, ప్రతాపరుద్రుడు,రుద్రమదేవి విగ్రహాలను గుండం చెరువు వద్దఏర్పాటుచేస్తామన్నారు. రాష్ట్ర పర్యాటక శాఖ సహకారంతో నిధుల మంజూరుకు ప్రయత్నించనున్నట్టు తెలిపారు. తెలంగాణలో ఖిలా వరంగల్‌కు ఉన్న ప్రాధాన్యత దృష్ట్యా దేశ, విదేశీ సందర్శకుల తాకిడిని పెంచేందుకు మౌలిక సదుపాయాలు కల్పించి విస్తృత ప్రచారం కల్పిస్తామని అన్నారు.