ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు మోడీ సర్కార్ తీపికబురు అందించింది. తెలుగు రాష్ట్రాలకు కొత్తగా 16 మంది ఐఏఎస్‌లను కేటాయించింది. ఏపీకి 9 మంది, తెలంగాణకు ఏడుగురు ఐఏఎస్‌లను కేటాయించించింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కాగా.. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ పరిపాలన కోసం ఐఏఎస్‌ల కొరత ఉంది. అవసరమైనంత కంటే తక్కువ మంది ఐఏఎస్‌లు ఉన్నారు. దీనికి తోడు మరికొందరు కేంద్ర సర్వీసులకు వెళ్లిపోయారు. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వ పథకాలను సమర్థంగా అమలుచేయడానికి ఉన్నతాధికారులు లేరు. దీంతోపాటు తెలంగాణలో జిల్లాల సంఖ్య 10 నుంచి 33 కి పెంచారు. ఏపీలో కూడా జిల్లాల సంఖ్య పెంచవచ్చనే ప్రచారం ఉంది. ఈ క్రమంలో కేంద్రం కొత్తగా ఐఏఎస్‌లను కేటాయించించింది.
తెలంగాణ కొత్త క్యాడర్ ఐఏఎస్ లు
1. క్రాంతి వరుణ్ రెడ్డి
2. చిత్రా మిశ్రా
3. పాటిల్ హేమంత్ కేశవ్ (మహారాష్ట్ర)
4. గరిమా అగర్వాల్ (మధ్యప్రదేశ్)
5. దీపక్ తివారి (ఉత్తరాఖండ్)
6. అంకిత్ (ఉత్తరప్రదేశ్)
7. ప్రతిమా సింగ్ (ఉత్తరాఖండ్).