ప్రస్తుత ప్రధాన మంత్రి నరేందర్ మోదీ నేతృత్వంలోని తొలి ఎన్డీఏ ప్రభుత్వ హాయాంలో తీసుకున్న అతిపెద్ద సంచలన నిర్ణయం పాత నోట్లను రద్దు చేసి కొత్తగా రెండు వేల నోట్లను,వంద,రెండు ,ఐదు వందల నోట్లను తీసుకురావడం. అయితే తాజాగా మరో సరికొత్త నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వస్తోన్నాయి. అదే కొత్తగా రూ. 2వేల నోట్లను ముద్రించడం ఆర్బీఐ నిలిపివేసింది అని.2016-17ఏడాదికి గాను రూ.354కోట్ల రెండు వేల నోట్లను ముద్రించిన ఆర్బీఐ ఆ తర్వాత ఏడాదికి గాను అంటే 2017-18కి గాను పదకొండు కోట్లకు తగ్గించింది. ఆ తర్వాత 2018-19కి మరింత తగ్గించి 4.6కోట్లకు మాత్రమే ముద్రించింది. కానీ ప్రస్తుత ఏడాదికి గాను మాత్రం ఒక్క నోటు కూడా ముద్రించలేదు. నల్లధనాన్ని తీసుకురావడానికే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆర్బీఐ చెప్పినట్లు వార్తలు వస్తోన్నాయి.