బిగ్‌బాస్ షోలో అందంతో హాల్ చల్ చేసున్న శ్రీముఖి స్ట్రాంగ్ కంటెస్టెంట్ అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. బిగ్‌బాస్ టైటిల్ కోసం వేట మొదలు పెట్టిన శ్రీముఖి ఎలాగైనా టైటిల్‌ను తన్నుకుపోవాలని ప్రయత్నిస్తోంది. అందుకోసం ఆమెకు మద్దతుగా వినూత్న క్యాంపెయిన్ జరుగుతోంది. ఓట్ ఫర్ శ్రీముఖి అంటూ సినిమా థియేటర్లలో ఎక్కడ చూసినా శ్రీముఖి యాడ్స్ ప్రత్యక్షమవుతున్నాయి. దీనిపై సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. శ్రీముఖి.. తనకు ప్రచారం కల్పించడానికి కొంతమందిని నియమించుకుందని అంటున్నారు. ఆ పెయిడ్ బ్యాచ్.. రాత్రింబవళ్లు కష్టపడుతూ పోస్టర్లు, యాడ్స్ అంటూ ఏ ఒక్కటినీ వదలకుండా ఆమెను సేవ్ చేయండంటూ దరువు వేస్తున్నారని విమర్శిస్తున్నారు. పెయిడ్ బ్యాచ్ సహాయంతో నకిలీ ఓట్లు సంపాదించి టైటిల్ విన్నర్‌గా నిలవాలని చూస్తోందని ఆరోపించారు. ఆమెకోసం ఎంత ఖర్చు పెట్టినా వృథాయే అని ప్రచారాన్ని గడ్డిపోచతో సమానంగా చూస్తున్నారు కొంతమంది ఫ్యాన్స్. ఇలాంటి యాడ్స్ వల్ల ఉన్న ఓట్లు కూడా పోతాయని ట్రోల్ చేస్తున్నారు.
Sreemukhi Paid Mafia Ads in Theatres do not vote her ? #BiggBossTelugu3 pic.twitter.com/r3evCvmLJQ
— చందుగాడు (@Chandann9999) October 14, 2019
sreemukhi theater ads trolls chusthuna it is not wrong they have money they are doing it.. but ala cheyadam valla valake bokka edo forcefull ga vepisthunatu untadi adi chusi kondaru veyaru kuda. votes will come in genuine way no matter how much promotion u do #BiggBossTelugu3
— DineshChakre (@chakre_dinesh) October 15, 2019
Promotions/Campaigns/Marketing in all best ways possible with good reach ki Mafia ki difference telidhu anukunta.
In this game format every HM has their own campaign.
"Paid Mafia" aithe public display undadhu.#biggbosstelugu3
— Annie Juvvanapudi (@anniejuvvan) October 15, 2019