అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా 2024లో చంద్రుడిపైకి మనుషులను పంపేందుకు సిద్ధమవుతోంది. ఈమేరకు వారికి కొత్తతరం స్పేస్సూట్లను ఆవిష్కరించింది. వీటిలో ఒక స్పేస్‌సూట్‌ను ఎక్ష్ ప్లోరేషన్ ఎగ్జ్రా వెహిక్యులర్ మొబిలిటీ యూనిట్ లేదా గ్జెముగా నాసా పిలుస్తోంది. గ్జెమూను చంద్రుడి దక్షిణ ధ్రువంపై ఉపయోగించేందుకు డిజైన్ చేసింది.చంద్రుడిపై ఎక్కువ కాలం పరిశోధనలు చేసేందుకు గ్జెము ఉపకరిస్తుందని పరిశోధకులు అంచనా వేస్తున్నారు.మరో స్పేస్‌సూట్‌ను ఓరియన్ క్రూ సర్వైవల్ సిస్టమ్‌గా పిలుస్తోంది. ఓరియాన్ అంతరిక్ష నౌక కోసం నాసా దీన్ని రూపొందించింది. చంద్రుడిపైకి తొలి మహిళను పంపేందుకు ‘ఆర్టెమిస్’ అనే భారీ ప్రాజెక్టును నాసా చేపట్టింది. మునుపెన్నడూ లేని విధంగా ప్రత్యేకంగా పంపటానికి ప్రయత్నాలు చేస్తున్నామని నాసా అడ్మినిస్ట్రేటర్ జిమ్ బ్రిడెన్‌స్టైన్ అన్నారు. ఇప్పుడున్న అన్నింటి కన్నా ఈ సూట్లు చాలా విభిన్నం. చంద్రుడిపై ఉండే వాతావరణానికి అనుగుణంగా సూట్‌ను తయారు చేసినట్లు నాసా మేనేజర్ క్రిస్ హాన్సెన్ తెలిపారు. సూట్లో ఏదైనా అంతరాయం కలిగితే దాన్ని భూమి మీదకు తీసుకురాకుండా పైనే సమస్యను పరిష్కరించవచ్చని స్పష్టం చేశారు.