టాలీవుడ్ సూపర్ స్టార్ ,ప్రిన్స్ మహేష్ బాబు వలన విక్టరీ వెంకటేశ్ నష్టపోవడం ఏమిటని ఆలోచిస్తున్నారా..?. విక్టరీ సీనియర్ నటుడు. మహేష్ జూనియర్ నటుడు. ఆయన వలన ఇతను నష్టపోవడం ఏమిటని చిరాకు పడుతున్నారా..?. అయితే ఈ స్టోరీ చదవండి మీరే ఆర్ధం చేసుకుండి. విక్టరీ వెంకటేష్, అక్కినేని వారసుడు అక్కినేని నాగ చైతన్య హీరోలుగా నటిస్తున్న తాజా చిత్రం వెంకీ మామ షూటింగ్ మొత్తం పూర్తి చేసుకుని వచ్చే సంక్రాంతికి విడుదలకు సిద్ధమయింది.
ఈ సమయంలోనే మహేష్ బాబు హీరోగా నటించిన సరిలేరు నీకెవరు చిత్రం కూడా వెంకీ మామా విడుదల రోజు అనగా జనవరి పన్నెండో తారీఖునే చేయాలని చిత్రం యూనిట్ భావిస్తుంది. గత ఏడాది సంక్రాంతికి విడుదలైన ఎఫ్2 మంచి హిట్ ను సాధించడంతో పాటు బాక్స్ ఆఫీస్ దగ్గర కాసుల వర్షం కురిపించింది.
అదే విధంగా ఈ సంక్రాంతిని కూడా క్యాష్ చేసుకోవాలని ఆశించిన విక్టరీ వెంకటేష్ కు మహేష్ రూపంలో గట్టి షాక్ తగిలింది. ఇదే సమయంలో మరో అల్లు అర్జున హీరోగా నటించిన అల వైకుంఠపురంలో కూడా అదే రోజు విడుదల కావడంతో థియేటర్లు కొరత తీవ్రతం కానుంది. దీంతో ఓపెనింగ్ కలెక్షన్లు తగ్గి వెంకటేశ్ మహేష్ వలన నష్టపోవడం ఖాయమంటున్నారు సినీ విశ్లేషకులు.