కైరా అద్వాని…టాలీవుడ్ లో ‘భరత్ అనే నేను’ సినిమాతో అడుగుపెట్టిన ఈ ముద్దుగుమ్మ తన నటనతో డాన్స్ తో మంచి పేరు తెచ్చుకుంది. అంతేకాకుండా ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద రికార్డులు సృష్టించి. దాంతో అవకాశాలు తన్నుకుంటూ వచ్చాయి. అనంతరం కొన్ని రోజుల తరువాత అర్జున్ రెడ్డి రీమాక్ కబీర్ సింగ్ లో నటించింది. దాంతో ఒక్కసారిగా మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ లిస్టులో చేరింది. ఆ తరువాత విజయ్ దేవరకొండతో ఎక్కువగా కనిపించింది. ఇదంతా పక్కనపెడితే ప్రస్తుతం ఈ భామకోసం డైరెక్టర్స్ క్యూ కడుతున్నారని సమాచారం. దీనిబట్టే అర్డంచేసుకోవచ్చు ఆమెకు ఎంత క్రేజ్ ఉంది అనేది.
