వినడానికి వింతగా ఉన్న ఇదే నిజమండీ బాబు. అదేంటీ మెగాస్టార్ చిరంజీవి తాజాగా విడుదలైన సైరా నరసింహా రెడ్డి ఘనవిజయం సాధించడమే కాకుండా కలెక్షన్ల సునామీ సృష్టించడంతో తెగ ఎంజాయ్మెంట్ తో ఉంటే దేవుడి గుళ్లల్లో అక్రమాలను బయటపెట్టడం ఏమిటని ఆలోచిస్తున్నారా..?.
సైరా నరసింహా రెడ్డి తర్వాత మెగాస్టార్ నటిస్తున్న తాజా చిత్రాన్ని ప్రముఖ సందేశాత్మక చిత్రాల దర్శకుడు కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటి వరకు తాను తీసిన సినిమాలన్నింటీలోనూ సమాజపరమైన.. సామాజిక పరమైన సందేశాలనిచ్చాడు కొరటాల శివ .
మెగాస్టార్ చిరంజీవితో తీసే మూవీలో మాత్రం ప్రస్తుతం సమాజంలో దేవుళ్ల గుడుల్లో జరిగే అవినీతి అక్రమాల అన్యాయాల గురించి తీయబోతున్నాడని ఆ చిత్రం యూనిట్ చెబుతుంది. ఇటీవలే ఈ చిత్రానికి సంబంధించి పూజా కార్యక్రమాలను పూర్తి చేసుకుంది.త్వరలోనే ఈ సినిమా షూటింగ్ జరుపుకోనున్నది. ఇది అన్నమాట ఈ టైటిల్ వెనక ఉన్న అసలు కథ.