తెలంగాణ రాష్ట్ర ప్రణాళిక ,అభివృద్ధిలో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం సమగ్ర కార్యాచరణను రూపొందించేందుకు సేజిస్ అనే సంస్థతో ఈ రోజు బుధవారం ఒక అవగాహానా ఒప్పందాన్ని కుదుర్చుకుంది. తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హారీశ్ రావు ,ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ సమక్షంలో ఎంవోయూ పత్రాలను అధికారులు మార్చుకున్నారు. తెలంగాణ రాష్ట్ర సమగ్ర అభివృద్ధికి ఈ ఒప్పందం ఎంతగానో ఉపయోగపడుతుంది. బంగారు తెలంగాణకై ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో టీఆర్ఎస్ ప్రభుత్వం అహర్నిశలు కృషి చేస్తుందని మంత్రి హారీష్ రావు పునరుద్ఘాటించారు. ఈ కార్యక్రమంలో ‘ట్రాన్స్‌ఫార్మింగ్ స్టేట్ ఎఫెక్టివ్ నెస్ ఇన్ తెలంగాణ’ అనే అంశంపై నీతీఆయోగ్ సలహాదారుడు మురళీధరన్ కార్తికేయన్, ప్రభుత్వ ఆర్థిక సలహాదారులు జీఆర్.రెడ్డి, రాష్ట్ర ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణా రావు. అర్థ గణాంక శాఖ డైరెక్టర్ సుదర్శన్ రెడ్డి, ప్లానింగ్ శాఖ డైరెక్టర్ షేక్ మీరా తదితరులు పాల్గొన్నారు