పాపం పవన్ కళ్యాణ్ ఏదో చెయ్యాలనుకుంటే ఏదేదో అయిపోతుంది. ప్రస్తుతం తన పరిస్థితి ఏమిటో తనకే అర్ధం కావడంలేదని తెలుస్తుంది. ఎన్నికలకు ముందు హడావిడి చేసిను పవన్ ఇప్పుడు దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నాడట. కనీసం తాను పోటీ చేసిన రెండు స్థానాల్లో ఒక్క దగ్గర గెలిచినా ప్రభుత్వాన్ని ప్రశ్నించే అవకాశం ఎక్కువగా ఉండేది. కాని ఇప్పుడు ఆటలు సాగడంలేదు. దాంతో ట్విట్టర్ కే పరిమితమయ్యాడు. ఎంత ట్విట్టర్ ఐనా రోజు అంటే కష్టమే. పవన్ కి హీరోగా ఉన్న క్రేజ్ అంతా ఇంత కాదు. పులిలా ఉండేవాడు పిల్లిలా అయిపోయాడు. అయితే ఇక అసలు విషయానికి వస్తే పవన్ సినిమా తియ్యాలంటూ కొందరు నిర్మాతలు కోరడం జరిగింది. ఈ మేరకు కధలు కూడా వినిపించారు. కాని పవన్ నుండి ఎటువంటి క్లారిటీ రావడం లేదు. పవన్ ఓకే చెబితే కధలు చెప్పడానికి చాలా మంది క్యూ లో ఉన్నారు. ఎన్నికల్లో అడుగుపెట్టిన పవన్ సినిమాల జోలికి పోను అని చెప్పి ఇలా కధలు చెబుతుంటే సినిమాల్లోకి రాను అని చెప్పకుండా కధలు ఎందుకు వింటున్నారనే అనుమానం ప్రస్తుతం అందరికి వస్తుంది.
