మరికొద్ది గంటల్లో బీసీసీఐ చీఫ్ గా పదవీ బాధ్యతలు నిర్వహించనున్న టీమిండియా మాజీ కెప్టెన్ ,క్యాబ్ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాము.
సౌరవ్ గంగూలీ టీమిండియా తరపున 113 టెస్టులు, 311 వన్డే మ్యాచులు ఆడాడు. 1992లో జాతీయ జట్టుకు అరంగేట్రం చేసిన దాదా కేరీర్లో 1996లో టెస్ట్ ల్లో ఆడటం మొదలెట్టాడు.
టెస్ట్ ల్లో దాదా ఎంట్రీతో టీమిండియా టెస్ట్ ల్లో సరికొత్త అధ్యాయం మొదలైంది. 2000 నుంచి 2005వరకు టీమిండియాకు సారథిగా వ్యవహారించాడు. 2008లో క్రికెట్ కు వీడ్కోలు పలికాడు ఈ బెంగాల్ టైగర్.
తన హాయాంలోనే మహ్మాద్ కైఫ్,యువరాజ్ సింగ్,ఎంఎస్ ధోనీ ,ఇర్ఫాన్ పఠాన్ ,యూసఫ్ పఠాన్ తదితర స్టార్ ఆటగాళ్లు వెలుగులోకి వచ్చారు. ఆ తర్వాత దాదా కొద్ది సీజన్ల పాటు ఐపీఎల్ లో ఆడాడు. 2015నుండి ఇప్పటివరకు సౌరవ్ రెండు దఫాలుగా క్యాబ్ అధ్యక్షుడిగా పదవీ బాధ్యతలు నిర్వహిస్తున్నాడు.