వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ప్రతి రైతుకు 12,500 చొప్పున నాలుగు సంవత్సరాలపాటు రైతు భరోసా ఇస్తాను అని దీనికి వైఎస్సార్ రైతు భరోసాగా పేరు పెట్టానని గత ఎన్నికల మేనిఫెస్టోలో జగన్ ప్రకటించారు. అప్పటి ప్రతిపక్ష నేతగా వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా జగన్ హామీ. అది కూడా 2020 వ సంవత్సరం మే నెల నుండి రైతు భరోసా ఇస్తామన్నారు. ప్రస్తుతం ఆర్థిక ఇబ్బందులు ఉన్న జగన్ రైతుల కోసం మరో అడుగు ముందుకు వేశారు. 12,500 రూపాయలు స్థానంలో 13500 నాలుగేళ్లపాటు ఇస్తానని హామీ ఇచ్చారు. ఐదేళ్లపాటు అంటే 50000 లబ్ధి చేకూర్చాలని అన్నారు.అలాగే ఈ డబ్బు మొత్తం బ్యాంకులకు పాత అప్పుగా జమ అవ్వకుండా మొత్తం రైతు చేతికి అందేలా బ్యాంకులతో ఒప్పందం కుదుర్చుకున్నారు. జగన్ నిర్ణయం పట్ల రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు