కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి పీ చిదంబరానికి మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. ఐఎన్‌ఎక్స్ మీడియా అవినీతి కేసులో అరెస్ట్ అయ్యి నెల రోజులకు పైగా (సెప్టెంబరు 5) తీహార్ జైల్లో గడుపుతున్న చిదంబరానికి బెయిల్ విషయంలో ఢిల్లీ సీబిఐ కోర్టులో ఊరట లభించలేదు. ఆయన దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌ను న్యాయస్థానం తిరస్కరించింది. ఈ నేపథ్యంలో ఆయనను రేపు (బుధవారం) ఈడీ అధికారులు అరెస్ట్ చేయనున్నారు. తీహార్ జైల్లో ప్రశ్నించిన అనంతరం ఆయనను అరెస్ట్ చేసే అవకాశం ఉంది. ఈ మేరకు ఈడీకి ఢిల్లీ కోర్టు అనుమతిని మంజూరు చేసింది. ఒక వైపు సిబిఐ, ఇంకో వైపు ఈడీ ఇలా వరుస కేసులతో చిదంబరాన్ని ఉక్కిరి బిక్కిరి చేస్తుంటే తాజాగా స్పెషల్ కోర్టు ఆదేశాలతో చిదంబరానికి మరిన్ని చిక్కులు తప్పేలా లేవు.
Tags case chidambaram congress court delhi jail
Related Articles
ముఖ్యమంత్రి కేజ్రీవాల్ సంచలన ఆరోపణలు
November 19, 2023