టీమిండియా మాజీ కెప్టెన్ మరియు ప్రస్తుత కీపర్ మహేంద్రసింగ్ సింగ్ ధోని 2019 ప్రపంచ కప్ తరువాత క్రికెట్ నుండి విరామం తీసుకున్న విషయం తెలిసిందే. అతను గత మూడు నెలల నుండి క్రికెట్కు దూరంగా ఉన్నాడు, అతను ఆటగాడిగా క్రికెట్ మైదానంలోకి ఎప్పుడు వస్తాడో ఎవరికీ తెలియదు. తాజాగా వచ్చిన సమాచారం ప్రకారం ధోని త్వరలోనే జట్టులోకి వచ్చే అవకాసం ఉందని తెలుస్తుంది. మరో పక్క మాజీ క్రికెటర్లు సైతం ధోని విషయంలో ఘాటుగా స్పందిస్తున్నారు. మరోపక్క తన ఆట తన ఇష్టం ఎప్పుడు రావాలో అనేది అతని అభిప్రాయమని వార్తలు వస్తున్నాయి.