రానా దగ్గుబాటి…ప్రస్తుతం ఈయన కోసం ఎంతో మంది ఎదురుచూస్తున్నారు. రానా ప్రస్తుతం హైదరాబాద్ కు దూరంగా ఉన్నాడు. చాలా రోజుల నుండి అమెరికాలోనే ఉన్నాడు. అయితే ఎందుకు అనే విషయానికి వస్తే షూటింగ్ అని ఇంకా ఏవేవో సాకులు చెబుతున్నాడు. కాని జనాలు పిచ్చోలు కాదని బాబు కి అర్ధం కాలేదనుకుంట. తాను చెప్పనప్పటికీ రానా ఆరోగ్య విషయంకై చికిత్స కోసం అక్కడికి వెళ్ళాడని అందరికి తెలిసిపోయింది. ఇప్పుడు తిరిగి వచ్చిన రానా హైదరాబాద్ రాకుండా ముంబై లోనే ఉన్నాడు. ఇదంతా పక్కన పెడితే ప్రస్తుతం ఈయన కోసం చాలా సినిమాలు మధ్యలోనే ఆగిపోయాయి. అతను వస్తేనే ఇవి పూర్తి అవుతాయి. అయితే తాజాగా వచ్చిన సమాచారం ప్రకారం వీటిని గాలికి వదిలేసిన రానా మరో కొత్త ప్రాజెక్ట్ కు ఓకే చెప్పాడని తెలుస్తుంది. దీనిపై అందరు మండిపడుతున్నారు.
