ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న వైఎస్సార్ రైతు భరోసా పిఎం కిసాన్ ఈరోజు నెల్లూరులో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేతుల మీదుగా లబ్ధిదారులకు చెక్కుల పంపిణీ ప్రారంభం కానుంది. నెల్లూరులోని విక్రమ సింహపురి యూనివర్సిటీ లో ఈ కార్యక్రమం జరుగుతుంది. బహిరంగ సభలో జగన్ మోహన్ రెడ్డి రైతులను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ఏ ఒక్కరికి అన్యాయం జరగకుండా లబ్ధిదారుల అందరికీ నిధులు జమ అయ్యేటట్లు చర్యలు తీసుకుంటున్నారు. ఇక్కడ మరో ప్రశ్న ఉత్పన్నమవుతుంది ఒకవేళ రైతు భరోసా పథకానికి ఎంపికైన వ్యక్తి మరణిస్తే భరోసా ఎవరికి ఇస్తారు అనే దానిపై చర్చ జరగగా సీఎం జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఒకవేళ రైతు మరణిస్తే అతని భార్యకు భరోసా ఇచ్చేలా మార్గదర్శకాలు మార్పులు చేయాలని ఒకవేళ పిల్లలు ఉద్యోగస్తులు ఆదాయపు పన్ను కడుతున్న సరే వ్యవసాయం చేస్తున్న తల్లిదండ్రులకు ఈ పథకాన్ని వర్తింపజేయాలని ఆదేశించారు. భరోసా కింద ఇచ్చే మొత్తాన్ని బ్యాంకులు మినహాయించి లేనివిధంగా ఖాతాల్లో నగదు జమ కావాలని, అర్హులైనవారికి ఈ పథకం వర్తించకపోతే ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని సీఎం అన్నారు.
