తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ మెట్రో సరికొత్త రికార్డును తన సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో సోమవారం ఒక్కరోజే వివధ మార్గాల్లో 3.80 లక్షల మంది మెట్రోలో ప్రయాణించి సరికొత్త రికార్డును లిఖించుకుంది.
హైదరాబాద్ మెట్రో ప్రారంభమైన తర్వాత ఇది సరికొత్త రికార్డు అని సంబంధిత అధికారులు చెబుతున్నారు. అయితే ఇప్పటివరకు సుమారు 3.65 లక్షల మంది ప్రయాణించడం రికార్డుగా నమోదు అయింది.
తాజా ఈ రికార్డుతో ఆ రికార్డు చెరిగిపోయింది. ఆర్టీసీ సమ్మె కారణంగా మెట్రో రైళ్లల్లో ప్రయాణికుల రద్ధీ పెరిగిన విషయం మనం గమనిస్తూనే ఉన్నాము. దీంతో ప్రయాణికుల సౌకర్యార్థం రోజుకు వందకుపైగా టిప్పులు అదనంగా అంటే మొత్తం ఎనిమిది వందల పది టిప్పులను మెట్రోరైళ్లను తిప్పుతున్నారు.