బీసీసీఐ చీఫ్ గా టీమిండియా మాజీ కెప్టెన్ ,ప్రస్తుతం బెంగాల్ క్రికెట్ సంఘం అధ్యక్షుడైన సౌరవ్ గంగూలీ ఎన్నిక లాంఛనమే ఇక. నిన్న సోమవారం నామినేషన్ పర్వానికి అఖరి రోజు కావడంతో బీసీసీఐ చీఫ్ పదవీకి కేవలం గంగూలీ ఒక్కడే నామినేషన్ వేశాడు.
బీసీసీఐ పదవీకాలం మూడేండ్లు . కానీ గంగూలీ మాత్రం కేవలం ఏడాది మాత్రమే ఈ పదవీలో ఉంటాడు. బీసీసీఐ అధ్యక్షుడుగా గంగూలీ వచ్చే ఏడాది సెప్టెంబర్ వరకు మాత్రమే కొనసాగుతాడు.
లోధా సంస్కరణల ప్రకారం గంగూలీకి కూలింగ్ ఆఫ్ సమయం ప్రారంభం కానున్నది. అంటే బీసీసీఐలో ఒక పదవీని వరుసగా రెండు దఫాలుగా నిర్వహించిన వారు ఆపై మూడేళ్లు విరామం తీసుకోవాలి. దాదా ప్రస్తుతం క్యాబ్ అధ్యక్షుడిగా వరుసగా రెండోసారి నేతృత్వం వహిస్తున్నాడు. దీనివలన గంగూలీ ఏడాది మాత్రమే ఈ పదవీలో ఉంటాడు.