2014లో అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం మొత్తం 43 లక్షల మంది రైతు భరోసా కు లబ్ధిదారులు ఉంటారు అంటూ అంచనా వేసింది. అయితే 2019లో అధికారం చేపట్టిన జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం మరోసారి పారదర్శకంగా సర్వే నిర్వహించింది. గత ప్రభుత్వంలో అర్హులైన రైతు కుటుంబాలను కలుపుతూనే ఇప్పటి వరకు పెట్టుబడి సహాయానికి గుర్తించిన వారితో కలిపి 51 లక్షల మందిని గుర్తించింది. అలాగే వీరు కాకుండా ఎస్సీ, ఎస్టీ బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన మూడు లక్షల మంది భూమి లేని కౌలు రైతు కుటుంబాలకు ఏడాదికి 13,500 రూపాయల పెట్టుబడి సహాయం అందించనున్నారు. దీంతో మొత్తం లబ్ధిదారుల సంఖ్య నలభై మూడు లక్షల నుండి 54 లక్షలకు చేరింది. ఖరీఫ్ పంట వేసే సమయంలో మే నెలలో 7,500 రబీ పంటలకు అవసరమైన అక్టోబర్ నెలలో 4000, దాన్యం ఇంటికి చేరుతున్న సందర్భంలో సంక్రాంతి సమయంలో 2000 మొత్తం పెట్టుబడి సాయం 13500 వీరందరికీ అందించనున్నారు.
