తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లో ఎంఎంటీఎస్ ప్రయాణికులకు శుభవార్త. ప్రయాణికుల కోసం తొలిసారిగా హైటెక్ సిటీ రైల్వే స్టేషన్ వద్ద అద్దెకు కార్లు,బైకులు అందుబాటులోకి తీసుకొచ్చారు.
ఇందులో భాగంగా డ్రైవజీ ఇండియా ట్రావెల్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి కాంట్రాక్టు ఇచ్చినట్లు రైల్వే అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. అయితే ఈ కాంట్రాక్టు ఏడాది పాటు ఉంటుందని అధికారులు వివరించారు.
న్యూ ఇన్నోవేటివ్ నాన్ ఫేర్ రెవిన్యూ స్కీమ్ కింద ఈ సౌకర్యం ఈ నెల పదమూడో తారీఖు నుంచే అందుబాటులోకి వచ్చిందని వారు పేర్కొన్నారు.