టీమిండియా మాజీ కెప్టెన్ ,ప్రస్తుత బెంగాల్ క్రికెట్ సంఘం అధ్యక్షులు సౌరవ్ గంగూలీ మరో రికార్డుకు చేరువలో ఉన్నారు. సోమవారంతో ముగిసిన బీసీసీఐ చీఫ్ కు నామినేషన్ పర్వానికి కేవలం సౌరవ్ గంగూలీ ఒక్కడే నామినేషన్ వేయడంతో ఒక ఏకగ్రీవం కావడమే లాంఛనమైంది.
ఈ పదవీ చేపట్టనున్న రెండో క్రికెటర్ గా బెంగాల్ టైగర్ సౌరవ్ గంగూలీ చరిత్ర సృష్టించనున్నాడు. సౌరవ్ కంటే ముందు ఏపీలోని విజయనగరం జిల్లాకు చెందిన మహారాజు విజయ ఆనందగజపతి రాజు ఈ పదవీ చేపట్టారు.
ఆయన అప్పట్లో 1954-56మధ్య బీసీసీఐ అధ్యక్షుడిగా సేవలనందించారు.మళ్లీ అరవై ఐదేళ్ల తర్వాత బీసీసీఐ చీఫ్ అధ్యక్షుడిగా పదవీ బాధ్యతలు చేపట్టనున్న తొలి క్రికెటర్ గా దాదా చరిత్రకెక్కనున్నాడు.