టైమ్ ఎప్పుడూ అందరికి ఒకేలా ఉండదు. నేడు మంచి అన్నవాళ్ళే రేపు చెడ్డ అంటారు. ముఖ్యంగా ఇది సినిమా వాళ్లకి బాగా సూట్ అవుతుంది. సినిమా విషయానికి వస్తే సినిమా హిట్ అయితే హీరో, హీరోయిన్లు సూపర్ అంటారు. అదే ఫ్లాప్ అయితే వాళ్ళు చాలు వారి కెరీర్ పోగొట్టడానికి. ప్రస్తుతం అదే ట్రెండ్ నడుస్తుంది. ఇక అసలు విషయానికి వస్తే శ్వేతా బసు ప్రసాద్..ఈ పేరు చెబితే ముందుగా ఎవరికైనా గుర్తొచ్చే చిత్రం కొత్త బంగారు లోకం. ఈ చిత్రం లో తన నటనకు అందరు ఫిదా అయ్యారని చెప్పాలి. ఒక్కసారిగా అందరిని తన పక్కకు తిప్పుకుంది.అలా కొన్ని రోజులు తన హవా నడించింది. కాలం గడిచే కొద్ది తన సినిమాలు ఫ్లాప్ అవ్వడంతో సైడ్ హీరోయిన్, ఐటమ్ సాంగ్స్ కే పరిమితం అయ్యింది.
ఇలా ఎన్ని అవతారాలు ఎత్తినా ఇబ్బందులు మాత్రం తనని వదలలేదు. చివరికి వ్యభిచారంలో పోలీసులకు అడ్డంగా దొరికిపోయింది. దాంతో ఒక్కసారిగా మీడియాకు ఒక హాట్ టాపిక్ దొరకడంతో కోర్టులు, కేసులు అని ఆడుకున్నారు. చివరికి కేసు నుంచి విముక్తి చెందిన తర్వాత తనకి అవకశాలు మొత్తం చేజారిపోయాయి. ప్రతీ ఒక్కరికి ఒక రోజు వస్తుంది అన్నట్లు మళ్ళీ తనకో రోజు రానే వచ్చింది. నెమ్మదిగా పాత విషయాలు మర్చిపోయిన ఈ భామ హిందీలో సినిమాలు చేస్తుంది. ప్రస్తుతం ఆమె నటించిన ‘ది తాష్కెంట్ ఫైల్స్’ శ్వేతకు వరంలా మారింది. ఈ చిత్రం ఆస్కార్ కు నామినేట్ అయ్యింది. దీంతో ఈ ముద్దుగుమ్మ మళ్ళీ పూర్వ వైభవం చూడబోతుంది.