“ఏపీ ప్రజా రవాణా శాఖగా” ఏపీఎస్ ఆర్టీసీ పేరు మార్చుకుంది.. ఆర్టీసీని ప్రభుత్వం లో విలీనం చేయడంతో ఈ పేరు మారింది. ఇప్పటివరకు ఆర్టీసీ ప్రత్యేక అధికారాలు గల సంస్థగా ఉండేది. ఇప్పుడు ప్రభుత్వం లో విలీనం కావటంతో ప్రభుత్వం పేరు మార్చింది. గత ఎన్నికల్లో తాను గెలిస్తే ఆర్టీసీని విలీనం చేస్తానని జగన్ అప్పట్లో హామీ ఇచ్చారు. ఇచ్చిన మాటకు లోబడి గెలిచిన అతి తక్కువ సమయంలోనే ఆర్టీసీ ని ప్రభుత్వం లో విలీనం చేశారు.
