ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రభుత్వంపై టీడీపీ మాజీ మంత్రి యనమల తీవ్ర విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం వెనిజులా మోడల్ తీసుకొచ్చిందన్నారు. గవర్నమెంట్ టెర్రరిజంతో పారిశ్రామికవేత్తలు బెదిరిపోయారని ఆరోపించారు. అప్పు ఇస్తే ఎలా తీరుస్తారని ఇప్పటివరకు రాష్ట్రాన్ని ఏ బ్యాంకూ ప్రశ్నించలేదన్నారు. దళారీ వ్యవస్థను కవర్ చేయడానికే అర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి తాపత్రయం పడుతున్నారని వ్యాఖ్యానించారు. ఎక్సైజ్ ఆదాయం తప్ప అన్ని రంగాల రాబడి తగ్గిపోయిందని వివరించారు. కేంద్రం పేరుతో రవాణా రంగంలో భారీ జరిమానాలు విధిస్తున్నారని విమర్శించారు. మరి యనమల విమర్శలపై వైసీపీ నేతలు ఏవిధంగా స్పందిస్తారో చూడాలి.
