తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం పోలిటికల్ హాట్ టాపిక్ హుజూర్ నగర్ ఉప ఎన్నికలు. ఈ ఉప ఎన్నికలు ఇటు టీఆర్ఎస్ అటు కాంగ్రెస్ పార్టీలు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. మరో వైపు తెలంగాణలో పాగా వేయాలని చూస్తున్న బీజేపీ పార్టీ తమ ఓటు బ్యాంకును పెంచుకోవాలని చూస్తుంది. ఈ క్రమంలో ఈ నెల ఇరవై ఒకటో తారీఖున పోలింగ్ జరగనున్నడంతో ఎన్నికల ప్రచారం లో ఇరు పార్టీలు దూసుకుపోతున్నాయి. ఉప ఎన్నికల పోరు కేవలం ప్రధానంగా టీఆర్ఎస్ ,కాంగ్రెస్ పార్టీల మధ్యనే ఉందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
అధికార టీఆర్ఎస్ తరపున గత ఎన్నికల్లో ఆరు వేల ఓట్ల తేడాతో ఓడిపోయిన శానంపూడి సైదిరెడ్డి బరిలోకి దిగుతుండగా.. కాంగ్రెస్ తరపున టీపీసీసీ అధ్యక్షుడు,ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి సతీమణి ఉత్తమ్ పద్మావతి రెడ్డి పోటిలోకి దిగారు. తెలుగు మీడియాకు చెందిన జనం సాక్షి అనే పత్రిక నిర్వహించిన సర్వేలో గెలుపు ఎవరిది అనే అంశంపై హుజూర్ నగర్ నియోజకవర్గ ప్రజలు టీఆర్ఎస్ పార్టీకే పట్టం కట్టినట్లు తేలింది. అందులో భాగంగా నియోజకవర్గం మొత్తంగా 4,340 ఓటర్ల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుంది జనం సాక్షి.
జనం సాక్షి నిర్వహించిన ఈ సర్వేలో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డికే ఓటు వేస్తామని 2,735 మంది అంటే 63శాతం మంది తమ అభిప్రాయాన్ని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఉత్తమ్ పద్మావతి రెడ్డికి ఓటు వేస్తామని 1,540 మంది అంటే 35 శాతం మంది మాత్రమే తమ అభిప్రాయాలను తెలిపారు. ఇక ఓటు బ్యాంకును పెంచుకోవాలని చూస్తున్న బీజేపీ పార్టీ అభ్యర్థికి కేవలం అరవై నాలుగు మంది అంటే 1.49 శాతం మంది తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. నియోజకవర్గంలో హుజూర్ నగర్ మండలం,హుజూర్ నగర్ టౌన్, మల్లెచెరువు,గరిడెపల్లి,చింతలపాలెం,నేరేడుచర్ల, మట్టంపల్లి,పాలకీడు మండలాల్లో జనం సాక్షి ప్రజల అభిప్రాయాలను సేకరించింది.
హుజూర్ నగర్ మండలంలో టీఆర్ఎస్ పార్టీకి 60%,కాంగ్రెస్ పార్టీకి 36.5% ,హుజూర్ నగర్ టౌన్ లో టీఆర్ఎస్ పార్టీకి 64%,కాంగ్రెస్ పార్టీకి 36% , మల్లెచెరువు మండలంలో టీఆర్ఎస్ పార్టీకి 57%,కాంగ్రెస్ పార్టీకి 41% ,గరిడెపల్లి లో టీఆర్ఎస్ పార్టీకి 63%,కాంగ్రెస్ పార్టీకి 33% ,చింతలపాలెం లో టీఆర్ఎస్ పార్టీకి 62.5%,కాంగ్రెస్ పార్టీకి 37% ,నేరేడుచర్లలో టీఆర్ఎస్ పార్టీకి 73%,కాంగ్రెస్ పార్టీకి 25% , మట్టంపల్లిలో టీఆర్ఎస్ పార్టీకి 63%,కాంగ్రెస్ పార్టీకి 36.5% ,పాలకీడులో టీఆర్ఎస్ పార్టీకి 54%,కాంగ్రెస్ పార్టీకి 45% ఓట్లు వేస్తామని ప్రజలు తమ అభిప్రాయాలను తెలిపారు.