పూణే వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో టెస్టులో భారత కెప్టెన్ కోహ్లి తన కెరీర్ బెస్ట్ స్కోర్ 254 సాధించిన విషయం తెలిసిందే. దాంతో కోహ్లి ఆస్ట్రేలియా ఆటగాడు స్టీవ్ స్మిత్ ని నెం.1 ర్యాంక్ నుంచి వెనక్కి నెట్టడానికి రెండు పాయింట్లు వెనకబడి ఉన్నాడు. ప్రస్తుతం కోహ్లి 936 పాయింట్స్ తో ఉండగా.. స్మిత్ 937 పాయింట్స్ తో ముందు ఉన్నాడు. కోహ్లి 10ఇన్నింగ్స్ తరువాత తన మొదటి సెంచరీ సాధించాడు. ఇక రాంచీలో జరగబోయే ఆఖరి టెస్ట్ కోహ్లి బాగా రానిస్తే మాత్రం కోహ్లి ఈ ఫీట్ ని సాధిస్తాడని అందరు భావిస్తున్నారు.