తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీకి చెందిన సిబ్బంది గత పది రోజులుగా ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని డిమాండ్ చేస్తూ సమ్మె చేస్తున్న సంగతి విదితమే. ఈ సమ్మె గురించి ముఖ్యమంత్రి ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం కుదరదు. ఆర్టీసీలో డెబ్బై శాతం ప్రభుత్వ ఆధీనంలో.. ఇరవై శాతం ప్రయివేట్ ఆధీనంలో .. పది శాతం ఆర్టీసీ ఆధీనంలో బస్సులు నడుస్తాయి.
ఆర్టీసీని ప్రయివేట్ పరం చేయమని.. అది సంస్థ భవిష్యత్ కు మంచిది కాదని తేల్చి చెప్పిన సంగతి కూడా మనకు తెల్సిందే. అయితే తాజాగా లోక్ సత్తా వ్యవస్థాపక అధ్యక్షులు జేపీ ఆర్టీసీ సమ్మెపై స్పందించారు. ఆయన మాట్లాడుతూ” ప్రస్తుత పరిస్థితుల్లో సమ్మె కంటే ప్రభుత్వంతో చర్చలు జరిపి సమస్యలు పరిష్కరించుకుంటే బాగుంటది.
తెలంగాణ ప్రజలకు అత్యంత ముఖ్యమైన బతుకమ్మ,దసరా పండుగల సమయంలో సమ్మెకు దిగకుండా .. నల్లబ్యాడ్జులను ధరించి నిరసన తెలిపి.. పండుగ తర్వాత సమ్మె చేసి ఉంటే బాగుండేది. అయిన ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం వలన ఏలాంటి ప్రయోజనం ఉండదు. కానీ ఆర్టీసీకి ఇవ్వాల్సిన రాయితీలు ఎక్కువగా ఇవ్వాలి. సంస్థకు ప్రభుత్వం చెల్లించాల్సిన బకాయిలు చెల్లిస్తే సంస్థకు ఉపశమనం కలుగుతుంది. అంతే కానీ సమ్మె చేయడం వలన సంస్థ ఇంకా నష్టాల్లో కూరుకుపోతుంది. ఇప్పటికైన సిబ్బంది ఆలోచించాలి. ఆర్టీసీ సిబ్బంది ఆత్మహత్యలకు పాల్పడకుండా తమ డిమాండ్లను నెరవేర్చుకోవాలని”ఆయన సూచించారు.