పరశురామ్…గీతాగోవిందం సినిమాతో ఒక వెలుగు వెలిగిన దర్శకుడు. ఈ చిత్రంలో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జంటగా నటించగా ఇది బాక్స్ ఆఫీస్ వద్ద సూపర్ హిట్ అయ్యింది. ఈ దర్శకుడు ప్రస్తుతం మహేష్ తో సినిమా తియ్యాలని అనుకుంటున్నాడు. ఈ మేరకు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాడు. మరోపక్క అక్కినేని అఖిల్ తో తర్వాత ప్రాజెక్ట్ చేయనున్నాడు. అయినప్పటికీ ఇంకా మహేష్ వెనకాలే తిరుగుతున్నాడని తెలుస్తుంది. మహేష్ కు కధ చెప్పి ఎలాగైనా ఇంప్రెస్స్ చెయ్యాలని అనుకుంటున్నాడు. ఈ మేరకు గీత ఆర్ట్స్ తో రెడీ అయ్యాడు. కాని ప్రస్తుతం వేరే నిర్మాత కోసం వెతుకుతున్నాడట. తాజాగా వచ్చిన సమాచారం ప్రకారం మహేష్ కి కామెడీ పరంగా కాకుండా భరత్ అనే నేను లెక్కలో ఉంటే బాక్స్ ఆఫీస్ వద్ద హిట్ కొట్టే అవకాశం ఉంటుందని దర్శకుడికి సలహాలు ఇచ్చారట.
