టీమిండియాకు దూకుడు నేర్పిన ఆటగాడు.. కెప్టెన్.. ఓపెనింగ్ అంటే ఇలానే ఉండాలని రుచి చూయించిన డేరింగ్ అండ్ డాషింగ్ బ్యాట్స్ మెన్ .. ప్రస్తుత బెంగాల్ క్రికెట్ సంఘం అధ్యక్షుడు అయిన బెంగాల్ టైగర్.. భారత క్రికెట్ ప్రేమికులు.. అభిమానులు దాదా అని ముద్దుగా పిలుచుకునే సౌరవ్ గంగూలీ బీసీసీఐ అధ్యక్షుడిగా ఎన్నిక లాంఛనమేనా..?. బీసీసీఐకి నూతన బాస్ గా సౌరవ్ గంగూలీ ఎన్నికయ్యేందుకు రంగం సిద్ధమైందా..? . అంటే అవుననే అంటున్నారు బీసీసీఐ వర్గాలు.
ఈ రోజు సోమవారం బీసీసీఐ అధ్యక్ష ఎన్నికలకు నామినేషన్ పర్వానికి అఖరి తేది కావడంతో ఇంతవరకు ఎవరు నామినేషన్ వేయడానికి ముందుకు రాలేదు. గంగూలీకి పోటిగా నిలుస్తారని భావించిన మాజీ అధ్యక్షుడు శ్రీనివాసన్ వర్గీయుడైన బ్రిజేష పటేల్ పక్కకు తప్పుకోవడం దాదా ఏకగ్రీవం కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి. మరోవైపు కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షా కుమారుడు జై షా కార్యదర్శిగా .. బోర్డు మాజీ చీఫ్ ,ప్రస్తుత కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ సోదరుడైన అరుణ్ ధుమాల్ కోశాధికారిగా పగ్గాలు చేపట్టనున్నారు.