గౌతమ్ గంభీర్…ఈ పేరు వింటే ఎంతటి వాడికైనా వణుకు పుట్టాల్సిందే. బ్యాట్టింగ్ తోనే కాదు మాటలతో కూడా బయపెట్టగలిగే వ్యక్తి గంభీర్. 2007 టీ20, 2011 ప్రపంచ కప్ లు భారత్ గెలవడంలో ముఖ్య పాత్ర ఈయనదే. ఈ రెండిటిలో ఫైనల్ మ్యాచ్ లలో కష్టకాలంలో జట్టును ఆదుకొని విజయం దిశగా నడిపించాడు. ఒక్క వన్డేలు, టీ20లలోనే కాదు టెస్టుల్లో కూడా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ఒక పరంగా చూసుకుంటే టెస్టుల్లో గంభీర్, సెహ్వాగ్ వస్తున్నారు అంటే ఎదుటివారు బయపడేవారు. వారిద్దరి పార్టనర్ షిప్ చాలా బాగుండేది. అంతేకాకుండా భారత్ జట్టుకు కెప్టెన్ గా వ్యవహరించి ఎన్నో విజయాలను తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక మరోపక్క ఐపీఎల్ లో కోల్కతాకు సారధిగా వ్యవరించి రెండు టైటిల్స్ కూడా తెచ్చిపెట్టాడు. అలాంటి గ్రేట్ ప్లేయర్ కాలం గడిచే కొద్ది జట్టులో తన స్థానం కోల్పోవడమే కాకుండా అతడి మాటలు ఎన్నో వివాదాలకు దారి తీసేతట్టుగా ఉండేవి. అలా క్రికెట్ కు దూరం అయినప్పటికే బయట ఉండి కూడా జట్టుకి ఇప్పటికీ సలహాలు ఇస్తూనే ఉంటాడు. ఇక క్రికెట్ గురించి పక్కన పెడితే మొన్న జరిగిన ఎన్నికల్లో బీజేపీ ఎంపీగా పోటీ చేసి గెలిచాడు.
