తెలుగు దేశం పార్టీ అధినేత ,నవ్యాంధ్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు ఆ పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే గట్టి షాకిచ్చారు. తెలంగాణ టీడీపీ ఉపాధ్యాక్షురాలైన ,మాజీ ఎమ్మెల్యే ఏలేటి అన్నపూర్ణమ్మ, ఆమె తనయుడు మల్లిఖార్జున్ రెడ్డి టీడీపీకి రాజీనామా చేసే యోచనలో ఉన్నారు.
అందులో భాగంగా ఏలేటి అన్నపూర్ణమ్మ ఇప్పటికే తన అనుచరులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఇటీవల తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్ ఆమెను కలిసి బీజేపీలోకి రావాల్సిందిగా ఆహ్వానించారు.
దీంతో తన అనుచరులతో భేటీ అయిన అన్నపూర్ణమ్మ ఈ నెల పద్దెనిమిదో తారీఖు లేదా ఈ నెల వారాంతంలో బీజేపీ కండువా కప్పుకోవడానికి సిద్ధమైనట్లు ఆమె తన అనుచరులకు తెలిపారు. దీనికి సంబంధించి భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసి బీజేపీకి చెందిన రాష్ట్ర జాతీయ నేతలను ఆహ్వానించి కమలం కండువా కప్పుకోవడానికి ప్రయత్నాలు మమ్మురం జరుగుతున్నాయి.