ఎట్టకేలకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, మెగాస్టార్ చిరంజీవిల మధ్య విందు సమావేశం జరిగింది. ఈ సమావేశం గత వారమే జరగాల్సి ఉండగా.. జగన్ ఢిల్లీ పర్యటన నేపధ్యంలో అది కాన్సిల్ అయ్యింది. జగన్ కలవడానికి భార్య సురేఖాతో పాటు మెగాస్టార్ అమరావతికి వెళ్లారు. సీఎం జగన్, ఆయన భార్య భారతి చిరంజీవికి ఆత్మీయ స్వాగతం పలికారు.ఆంధ్రప్రదేశ్‌లో రోజూ ఆరు షోలను ప్రదర్శించడానికి ‘సైరా’ కి అనుమతి ఇచ్చినందుకు సీఎం జగన్‌కు చిరంజీవి కృతజ్ఞతలు తెలిపారు.చిరంజీవి తన డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన ఈ చిత్రాన్ని చూడాలని జగన్ అభ్యర్థించారు. ఈ షెడ్యూల్ ప్రకారం చిరంజీవి, తనయుడు రామ్ చరణ్ రావాల్సి ఉంది. కాని భార్య సురేఖతో చిరు వచ్చాడు. దాంతో చెర్రీ ఎక్కడా అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ వస్తున్నాయి.