చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం నుంచి ఏపీ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు 30 ఏళ్లుగా తిరుగులేని ఏకచక్రాధిపత్యాన్ని వహిస్తున్నారు. అయితే రికార్డుస్థాయిలో 7 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొంది, ఇప్పటివరకు 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పని చేసినా…కుప్పం నియోజకవర్గానికి బాబు పెద్దగా ఒరగబెట్టిందేమి లేదు. ఇప్పటికీ కుప్పం నియోజకవర్గం అభివృద్ధిలో వెనుకబడిపోయే ఉంది. చంద్రబాబు సీఎంగా పని చేసిన కాలంలో కూడా ఇక్కడ పెద్దగా డెవలప్‌మెంట్ జరిగింది లేదు. అందుకే ఈ సారి ఎన్నికలలో చంద్రబాబుకు మెజారిటీ బాగా తగ్గింది. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చంద్రమౌళి గట్టిపోటీ ఇవ్వడంతో ఈసారి కేవలం 27 వేల ఓట్ల తేడాతో చంద్రబాబు గెలుపొందారు. అదీ చంద్రబాబు సతీమణి భువనేశ్వరీ లోకల్ లీడర్లతో కలిసి ఓట్లు, నోట్ల రాజకీయం చేయడంతో ఆ మాత్రం మెజారిటీ వచ్చిందని ఇన్‌సైడ్ టాక్. అంతే కాదు సరిగ్గా ఎన్నికల ప్రచార సమయంలో వైసీపీ అభ్యర్థి చంద్రమౌళి అనారోగ్యంతో ఆసుపత్రి పాలవ్వడం కూడా చంద్రబాబుకు కలిసివచ్చింది. అయినా రెండు రౌండ్లలో చంద్రబాబు చంద్రమౌళికంటే వెనకబడిపోవడం గమనార్హం.
వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత..సీఎం జగన్ ప్రాంతం, పార్టీ, వర్గం, కులం, మతం చూడకుండా అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలు అందిస్తాం..పార్టీలకతీతంగా అన్ని నియోజకవర్గాల అభివృద్ధికి పాటుపడతామని ప్రకటించాడు. ఈ క్రమంలో కుప్పం నియోజకవర్గాన్ని మున్సిపాలిటీగా ప్రకటిస్తూ సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు వైసీపీ సర్కార్ రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా 50 మున్సిపాలిటీలను ప్రకటించింది. అందులో చిత్తూరు జిల్లా నుంచి చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం ఒక్కటే చోటు దక్కించుకుంది. మిగిలిన మున్సిపాలిటీల కంటే..కుప్పం మున్సిపాలిటీలకు అధిక నిధులను గ్రాంట్‌గా మంజూరు చేయాలని సీఎం జగన్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. 30 ఏళ్లుగా అన్ని రంగాలలో వెనుకబడిన కుప్పం నియోజకవర్గాన్ని డెవలప్‌మెంట్ చేయాలనే ఉద్దేశంతో జగన్ ఉన్నట్లు సమాచారం. తద్వారా కుప్పంలో చంద్రబాబు చేయని అభివృద్ధిని తాము చేశామని చెప్పుకోవడానికి వీలుంటుందని ప్రభుత్వం భావిస్తోంది. ఈ క్రమంలో కుప్పం గ్రామపంచాయతీని మున్సిపాలిటీగా ప్రకటిస్తూ నోటిఫికేషన్ విడుదల చేసింది. కుప్పం గ్రామ పంచాయతీ మున్సిపాలిటీగా మారడంతో కుప్పం ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 30 ఏళ్లు చంద్రబాబు చేయలేనిది…3 నెలల్లో రాజన్న తనయుడు సీఎం జగన్ చేశాడని, దటీజ్ జగన్ అని కుప్పం ప్రజలు భావోద్వేగానికి గురవుతున్నారు.
కాగా ఎన్నికలకు ముందు చంద్రబాబు ప్రతిపక్ష ఎమ్మెల్యేలు ఉన్న నియోజకవర్గాలకు ఒక్క రూపాయి ఇవ్వలేదని పబ్లిగా చెబుతూ వెకిలి నవ్వులు నవ్వాడు..కానీ ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడి నియోజకవర్గం డెవలప్‌మెంట్ కోసం తాపత్రయపడుతున్న సీఎం జగన్‌ను చూసి నాటి చంద్రబాబు మాటలను కుప్పం ప్రజలు గుర్తు చేసుకుంటున్నారు. నాయకుడు అంటే పార్టీలకతీతంగా వ్యవహరించే జగన్‌లా ఉండాలని మెచ్చుకుంటున్నారు. సీఎం జగన్ తాజా నిర్ణయంతో కుప్పంలో అభివృద్ధి ఊపందుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. అదే జరిగితే..వచ్చే ఎన్నికలలో కుప్పంలో వైసీపీ జెండా ఎగిరే అవకాశాలు ఉంటాయి. సీఎం జగన్ నిర్ణయంతో కుప్పం తెలుగు తమ్ముళ్లు షాక్ అవుతున్నారు. ఇన్నాళ్లు తమ గ్రామపంచాయతీని మున్సిపాలిటీ గా మార్చాలని తమ బాసు బుర్రకు ఎందుకు తట్టలేదని వాళ్లు వాపోతున్నారు. 40 ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకునే చంద్రబాబు 45 ఏళ్ల యువ ముఖ్యమంత్రి జగన్ ముందు ఎందుకు కొరగాడు అని తెలుగు తమ్ముళ్లే ఆఫ్‌ది రికార్డుగా మాట్లాడుకుంటున్నారు. మొత్తంగా కుప్పం విషయంలో సీఎం జగన్ తీసుకున్న నిర్ణయం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.