ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చి నాలుగు నెలలే అయినప్పటికీ తాను పాదయాత్రలో ఇచ్చిన హామీలను ఒక్కొకటిగా నెర్వేర్చడమే కాకుండా మిగతా హమీలకోసం కృషి చేస్తూనే ఉన్నారు. ఇక మన మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు విషయానికి వస్తే ఓట్లు కోసం ఎన్నో తప్పుడు హామీలు ఇచ్చి చివరికి ప్రజలకు నమ్మకద్రోహం చేసాడు. ఇప్పుడు జగన్ చేస్తున్న మంచి పనులకు చూసి ఓర్వలేక కుళ్ళు కుతంత్రాలతో పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు. ఈ చేష్టలకు మరింత దిగజారిపోతున్నారు. దీనిపై ఘాటుగా స్పందించిన విజయసాయి రెడ్డి “పోలీసులకు వీక్లీ ఆఫ్, హోంగార్డుల వేతనం పెంపు లాంటి వాటిని జగన్ గారి ప్రభుత్వంలో అధికారులే ప్రకటించారు.
అదే చంద్రబాబు గారి హయాంలో న్యూస్ చానళ్ల ప్రైమ్ టైంలో భారీ మీడియా సమావేశం జరిగేది. సంఘాల నాయకులను ముందే పిలిపించి సిఎంను వీరడు, శూరుడు అని పొగిడించే కార్యక్రమాలు ఉండేవి అని అన్నారు. మరో ట్వీట్ లో వైఎస్సార్ రైతు భరోసా పథకం అమలు కోసం ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు గారు రూ.5510 కోట్లు విడుదల చేశారు. 50 లక్షల రైతు కుటుంబాలకు, కౌలు రైతులకు రూ.12,500 చొప్పున సాయం అందుతుంది. నోరు పెగలడం లేదు కదా చంద్రబాబు గారు. మీరు కలలో కూడా ఊహించి ఉండరు రైతులను ఈ విధంగా ఆదుకోవచ్చని అని చంద్రబాబుకు గట్టిగా ఇచ్చారు.