తనని తాను నిలబెట్టుకోవడం కోసం ఎంతటి సాహసానికైనా దిగుతాడు మాజీ సీఎం చంద్రబాబు. ఇంకా చెప్పాలి అంటే పక్కవారిని నిలువునా ముంచడానికి అస్సలు వెనకాడరు. గత ఎన్నికల్లో ఆయన అదే చేసారు. ఎలా అంటే తాను 2014 ఎన్నికల్లో గెలవడానికి అటు మోదీ, ఇటు పవన్ కళ్యాణ్ ని వాడుకున్నారు గెలిచాక యూటర్న్ తీసుకున్నాడు. దీనికన్నా ముఖ్యమైన విషయం ఏమిటంటే చంద్రబాబు గెలవాలంటే నాయకులకన్నా ముఖ్యం ప్రజల. వారినే బురుడీ కొట్టించాడు చంద్రబాబు. ఎన్నో హామీలు ఇచ్చి చివరికి గెలిచాక ప్రజల్ని పట్టించుకోకుండా తన సొంత వారికే అంతా చేసాడు. అదేమిటని అడిగినవారిని కాపాడాల్సిన పోలిసులతోనే కొట్టించాడు. మల్లా ఎన్నికలు దగ్గిర పడే సమయానికి ప్రజలే దేవుళ్ళు అంటూ యూటర్న్ తీసుకున్నాడు. ఇలా ప్రతీ విషయంలో బాబు యూటర్న్ తీసుకుంటూనే ఉన్నాడు. దీనిపై స్పందించిన వైసీపీ సీనియర్ నేత విజయసాయి రెడ్డి చంద్రబాబుకు అవార్డు ఇచ్చారు.”యూ-టర్న్ అనే పదం 1930 ప్రాంతంలో వాడుకలోకి వచ్చిందని ప్రఖ్యాత Merriam-Webster ఇంగ్లిష్ డిక్షనరీ చెబ్తోంది. ఇప్పటి దాకా లెక్కలేనన్ని సార్లు దాన్ని ఆచరణలో పెట్టిన రికార్డుచంద్రబాబు గారిదే. అవకాశవాదం, కాళ్లు పట్టుకోవడం తప్ప ఒక సిద్ధాంతం అంటూ లేని నాయకుడు ఇతనొక్కడే” అని చెప్పారు.
యూ-టర్న్ అనే పదం 1930 ప్రాంతంలో వాడుకలోకి వచ్చిందని ప్రఖ్యాత Merriam-Webster ఇంగ్లిష్ డిక్షనరీ చెబ్తోంది. ఇప్పటి దాకా లెక్కలేనన్ని సార్లు దాన్ని ఆచరణలో పెట్టిన రికార్డు @ncbn గారిదే. అవకాశంవాదం, కాళ్లు పట్టుకోవడం తప్ప ఒక సిద్ధాంతం అంటూ లేని నాయకుడు ఇతనొక్కడే.#UTurn
— Vijayasai Reddy V (@VSReddy_MP) October 14, 2019