జగన్ ముఖ్యమంత్రిగా ప్రమాస్వీకారం చేసినప్పటి నుండి తాను చేస్తున్న ప్రతీ పని ఒక సంచలనమే అనే విషయం అందరికి తెలిసిందే. ఈ సంచలనాల్లో ఒకటి ఏపీ డీజీపీగా గౌతమ్ సవాంగ్ ని నియమించడం. ఈ వ్యక్తి ఎలాంటి వాడు అందరికి తెలిసిందే. ప్రస్తుతం ఇతను ఒక సంచలనానికి దారితీసాడు. పోలీసులు ప్రజల రక్షణ పట్ల ఎటువంటి పాత్ర పోషిస్తున్నారు అనే విషయంపై ప్రజలకు తెలియజేయాలని నిర్ణయించారు. ఈ మేరకు ఎస్పీలు అందరికి ఆదేశించారు. అక్టోబర్ 21 పోలీస్ అమరవీరుల సంస్మరణ రోజు. ఈ సందర్భంగా 15 నుంచి 19 తేదీ వరకు జరిగే కార్యక్రమాల గురించి వివరించారు. 15,16 తేదీల్లో పిల్లలకు పెయింటింగ్, కార్టూన్ సంభందిత పోటీలు నిర్వహించాలని 17న రక్త దానం, 18న మారథాన్ ,19న కాలేజీల్లో సెమినార్లు నిర్వహించాలని ఆయన ఆదేశించారు.
