మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత రాష్ట్ర ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు నిన్న విశాఖ పర్యటనలో భాగంగా గాజువాక నియోజకవర్గ పరిధిలో టీడీపీ నేతలతో సమీక్ష నిర్వహించిన విషయం తెలిసిందే. అయితే ఆ సమయంలో అక్కడ కార్పొరేటర్ ఒకరూ చంద్రబాబుని మీరు ఇక్కడ పర్యటించకపోవడం వల్ల టీడీపీకి నష్టం జరిగిందని అన్నాడు. దీనికి సమాధానం ఇచ్చిన చంద్రబాబు హుందాగా ఉండాలనే ప్రచారానికి వెళ్లలేదని చెప్పుకొచ్చారు. దీనిపై వైసీపీ సీనియర్ నేత విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేదికగా ఘాటుగా స్పందించారు. “హుందాగా ఉండాలని పవన్ కళ్యాణ్ పోటీ చేసిన గాజువాకలో ప్రచారానికి వెళ్లలేదట చంద్రబాబు గారు. ఆయన కూడా హుందాగానే మాలోకం నిలబడిన మంగళగిరి మొహం చూడలేదేమో. ఆవిధంగా తామిద్దరం పార్టనర్లమని బయట పెట్టుకున్నారు. చీకటి పొత్తుల విషయాన్ని ప్రజలు గ్రహించబట్టే గట్టి గుణపాఠం చెప్పారు” అని గట్టిగా సమాధానం చెప్పారు.
హుందాగా ఉండాలని @PawanKalyan పోటీ చేసిన గాజువాకలో ప్రచారానికి వెళ్లలేదట @ncbn గారు. ఆయన కూడా హుందాగానే మాలోకం నిలబడిన మంగళగిరి మొహం చూడలేదేమో. ఆవిధంగా తామిద్దరం పార్టనర్లమని బయట పెట్టుకున్నారు. చీకటి పొత్తుల విషయాన్ని ప్రజలు గ్రహించబట్టే గట్టి గుణపాఠం చెప్పారు. @naralokesh
— Vijayasai Reddy V (@VSReddy_MP) October 13, 2019