మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు రోజురోజుకి దిగజారిపోతున్నారు. రోజుకో మాట మాట్లాడుతూ జనాల ముందు నవ్వులపాలు అవుతున్నాడు. అధికారంలో ఉన్నప్పుడు మాట్లాడిన మాటలకి ఇప్పుడు మాట్లాడే మాటలకి చూసుకుంటే చంద్రబాబుకి ఇలాంటి కోణం ఒకటి ఉందా అని అర్ధమవుతుంది. దీనిపై వైసీపీ సీనియర్ నేత విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేదికగా ఫుల్ క్లారిటీ ఇచ్చాడు. “మోదీ రాక్షసుడు, దేశానికి పట్టిన శని, భార్యను వదిలేసిన బాధ్యత లేని వ్యక్తి అని అనేక రకాలుగా దూషించిన చంద్రబాబు ఇప్పుడు ఆయనతో వ్యక్తిగత విభేదాలేమీ లేవని సన్నాయి నొక్కులు నొక్కుతున్నాడు. మోదీని గద్దె దింపడం కోసమే కాంగ్రెస్ తో చేతులు కలిపినట్టు చెప్పిన విషయాన్ని ఎవరూ మర్చిపోరు చంద్రబాబు” అని అన్నారు.
