పూణే వేదికగా జరుతున్న రెండో టెస్ట్ లో నాలుగో రోజే రిజల్ట్ వచ్చేలా ఉంది. వివరాల్లోకి వెళ్తే ముందుగా టాస్ గెలిచి బ్యాట్టింగ్ ఎంచుకున్న భారత్ అగర్వాల్ శతకం, కెప్టెన్ కోహ్లి డబుల్ సెంచరీ చేయడంతో 601పరుగులు చేసి డిక్లేర్ ఇచ్చింది. అనంతరం బ్యాట్టింగ్ కు వచ్చిన సఫారీలను ఇండియన్ పేసర్లు వచ్చిన వాళ్ళని వచ్చినట్టుగా వెనక్కి పంపించే పని తీసుకున్నారు. తక్కువ స్కోర్ కే 8వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న జట్టుకు అప్పుడే ఇద్దరు అండగా నిలిచారు. వారే ఫిలాండర్, మహారాజ్..వీరిద్దరూ స్కోర్ ను 270 కి తీసుకెళ్ళారు. వీరిద్దరిని ఔట్ చేయడానికి భారత బౌలర్స్ చాలా కష్టపడ్డారని చెప్పాలి. అంతేకాకుండా వీరులో ఫిలాండర్ 192 బంతులు, మహారాజ్ 132 బంతులు ఎదురుకున్నారు. నిజం చెప్పాలంటే సఫారీలను టైలెండర్ లే ఆడుకుంటున్నారు అని చెప్పాలి. అయితే ఈరోజు ఫాలో ఆన్ ఆడుతున్న సఫారీలు అప్పుడే నాలుగు వికెట్లు కోల్పోయారు. ఈసారి కూడా టైలెండర్ లే దిక్కు అని చెప్పడంలో సందేహం లేదు.