తాజాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి టీడీపీ నేత గతంలో వైసీపీలో క్రియాశీలకంగా పని చేసిన జూపూడి ప్రభాకర్ చేరిన నేపథ్యంలో పార్టీ క్యాడర్లో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. జూపూడి బాటలోనే మరి కొందరు నేతలు పార్టీ లోకి రానున్నారట.. వీరిలో విజయవాడ నుంచి జలీల్ ఖాన్ పేరు వినిపిస్తుంది. జలీల్ ఖాన్ గతంలో వైసీపీ నుండి గెలిచి పార్టీ ఫిరాయించారు. టీడీపీ ప్రభుత్వం నుంచి మంత్రి పదవి ఆశించి భంగపడ్డారు. ముక్యంగా బీకాం లో ఫిజిక్స్ చదివానంటూ ఉన్న పరువు పోగొట్టుకున్నారు. ఈ డైలాగ్ తో ఫేమస్ అయిన ఖాన్ మళ్ళి వైసీపీ వైపు చూస్తున్నాడట. అయితే జగన్ పార్టీలోకి జలీల్ ఖాన్ ని రానిస్తారా.. రానిస్తే పార్టీ క్యాడర్, సోషల్ మీడియా ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.
