తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీవేంకటేశ్వర భక్తి ఛానల్ (ఎస్వీబీసీ) బోర్డులో డైరెక్టర్లుగా టీవీ యాంకర్ స్వప్న, డైరెక్టర్ శ్రీనివాసరెడ్డిలను ఏపీ ప్రభుత్వం నియమించిందంటు వార్తలు వస్తున్నాయి. అయితే ఈ వార్తలుపై నటుడు శ్రీనివాస రెడ్డి స్పందించారు. తనపై జరుగుతున్న ప్రచారాన్ని ట్విట్టర్ వేదికగా ఖండించారు. ఆ పదవి దక్కింది తనకు కాదని.. ‘ఢమరుకం’ సినిమా దర్శకుడు శ్రీనివాస్ రెడ్డి అని ట్వీట్ చేశారు. గతంలో నటుడు పృథ్వీరాజ్ బాలిరెడ్డి ని ఎస్వీబీసీ ఛైర్మన్ గా నియమించిన విషయం తెలిసిందే.
శుభోదయం ??
నేను కాదు
"ఢమరుకం డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డిగారు"
ఎస్వీబీసీ డైరెక్టర్ గా నియమించబడ్డారు https://t.co/h644kroNQs— Srinivasareddy (@Actorysr) October 13, 2019