ఈ సంక్రాతికి సమరం సిద్దమైంది. అటు అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఇటు మహేష్ ఫ్యాన్స్ ఎవరూ తగ్గేట్టుగా కనిపించడంలేదు. అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కబోతున్న చిత్రం అల వైకుంఠపురంలో. ఈ చిత్రానికి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వం వహిస్తున్నారు. మరోపక్క సూపర్ స్టార్ మహేష్, రష్మిక మందన్న జంటగా నటిస్తున్న చిత్రం సరిలేరు నీకెవ్వరు. ఈ చిత్రానికి గాను అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నాడు. ఇదంతా బాగానే ఉందిగాని ఇక్కడే అసలు ఇబ్బంది మొదలైంది. ఇప్పుడు ఈ రెండు సినిమాలు వచ్చే ఏడాది పండక్కి ఒకేరోజున రిలీజ్ కానున్నాయి. మామోలు హీరోలు అయితే ఒకే డేట్ ఐన పెద్ద ఇబ్బంది ఉండదు. కాని ఇవి టాలీవుడ్ లోనే టాప్ హీరోల సినిమాలు కావడంతో ఏం అవుతుందనే ఆలోచనలో పడ్డారు. ఇక ఫ్యాన్స్ విషయానికి వస్తే పోటీ మామోలుగా ఉండదనే చెప్పాలి.