తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ కు చెందిన పోలీసులు నవ్యాంధ్రలోని నర్సరావుపేటలో వెళ్లారు. ఆ రాష్ట్ర దివంగత మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ ఆత్మహత్య కేసును విచారించేందుకు నగరంలోని బంజారాహీల్స్ పోలీసులు అక్కడకి చేరుకున్నారు.
ఈ కేసుకు సంబంధించి మరింత స్పష్టత కోసం కోడెల కుటుంబ సభ్యులను విచారణకు రావాలని హైదరాబాద్ పోలీసులు పిలిచారు. అయితే వారి నుండి ఎలాంటి స్పందన లేకపోవడంతో పోలీసులే వెళ్లారు.