హుజూర్ నగర్ లో గెలిచేది టీఆర్ఎస్ పార్టీనే అని ఎమ్మెల్యే,నేరేడుచర్ల టౌన్ ఎన్నికల ఇంచార్జ్ నన్నపునేని నరేందర్ అన్నారు..24,27 బూత్ లలో సాయిబాబా వీదితో పాటు పలు వీదులలో శానంపూడి సైదిరెడ్డిని గెలిపించవలసిందిగా ఇంటింటి ప్రచారం నిర్వహించారు.
ఈ ప్రచారంలో వరంగల్ తూర్పు ఎమ్మెల్యే ,నేరేడుచర్ల టౌన్ ఎన్నికల ఇంచార్జ్ నన్నపునేని నరేందర్ పాల్గొన్న ఇంచార్జ్ లు,ముఖ్య నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు..
ఈ సందర్బంగా ఎమ్మెల్యే నరేందర్ మాట్లాడుతూ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉత్తమాటలు చెప్పి ప్రజలను మభ్యపెట్టి వరుసగా ఇక్కడ గెలిచారని,కానీ నియోజకవర్గానికి ఆయన చేసిందేం లేదన్నారు.రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అనేక సంక్షేమాభివృద్ది కార్యక్రమాలను ప్రజలకు అందిస్తున్నారన్నారు.
తమ పర బేదం లేకుండా సీఎం గారు ప్రజలకు ఫలాలందిస్తుంటే ఉత్తమ్ ఏనాడూ ముఖ్యమంత్రి గారిని కలిసి నియోజకవర్గ అభివృద్దిపై చర్చించలేదన్నారు.అయినా ముఖ్యమంత్రి గారు నేరేడుచర్లను మున్సిపాలిటీగా మార్చి 10కోట్ల నిదులు కేటాయించారన్నారు..
టీఆర్ఎస్ అభ్యర్ది సైదిరెడ్డిని గెలిపించుకోవడం ద్వారా నియోజకవర్గం అద్బుతంగా అభివృద్ది చెందుతుందని,కారుగుర్తుకు ఓటువేసి టీఆర్ఎస్ ను గెలిపించాలన్నారు..
Tags by elections huzur nagar kcr ktr nannapuneni narendar slider trs trswp warangal east mla